సమంత స్థానంలో?
సినిమాల్లో కథానాయికల మార్పు సాధారణమే. అయితే ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో ఓ నాయిక స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి మార్పే ‘చెన్నై స్టోరీ’ విషయంలో జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో తొలుత సమంతను కథానాయికగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సమంత స్థానంలో శృతిహాసన్‌ను కథానాయికగా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. బాఫ్టా అవార్డు విజేత, డౌన్‌టౌన్ అబ్బే వంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్‌జాన్ దర్శకత్వంలో ‘చెన్నై స్టోరీ’ తెరకెక్కుతున్నది.
టిమెరి ఎన్ మురారి రచించిన ‘ది అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చెన్నై, ఇంగ్లాడ్‌లోని వేల్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో కథానాయిక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమా నుంచి సమంత తప్పుకున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అంతర్జాతీయ నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?