దంచికొట్టిన వాన
నగరంలో వర్షం శనివారం భారీగా కురిసింది. హయత్‌నగర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, ఉప్పల్, రామాంతాపూర్, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులతో నగరం ఉక్కపోతమయంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసింది.
- అత్యధికంగా హయత్‌నగర్‌లో 6.3 సెం.మీ
- పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నగరంలో వర్షం శనివారం భారీగా కురిసింది. హయత్‌నగర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, ఉప్పల్, రామాంతాపూర్, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులతో నగరం ఉక్కపోతమయంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసింది.
ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. అత్యధిక వర్షపాతం హయత్‌నగర్‌లో 6.3 సెం.మీటర్లుగా నమోదైంది. బాలాపూర్‌లో 5.9సెం.మీ, రాజేంద్రనగర్‌లో 4.4సెం.మీ., మైలార్దేవుపల్లిలో 4 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కాగా, శనివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.1డిగ్రీలు, గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది. మరో రెండు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

