అందానికి అమ్మమ్మ చిట్కా
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ హీరో విజయ్ దేవరకొండను పెండ్లి చేసుకొని తెలంగాణ కోడలైంది. పుష్ప లాంటి బ్లాక్‌బస్టర్‌లో నటించిన రష్మిక తన భర్త విజయ్‌తో కలిసి ‘రణబాలి’లో జతకట్టింది. ముచ్చటగా మూడోసారి దేవరకొండతో నటిస్తున్నా.. పెండ్లి తర్వాత ఈ జంట కలిసి చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ బ్యూటీ పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ హీరో విజయ్ దేవరకొండను పెండ్లి చేసుకొని తెలంగాణ కోడలైంది. పుష్ప లాంటి బ్లాక్‌బస్టర్‌లో నటించిన రష్మిక తన భర్త విజయ్‌తో కలిసి ‘రణబాలి’లో జతకట్టింది. ముచ్చటగా మూడోసారి దేవరకొండతో నటిస్తున్నా.. పెండ్లి తర్వాత ఈ జంట కలిసి చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ బ్యూటీ పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
ఇటీవల షూటింగ్లో గాయపడటంతో ఇంటికే పరిమితమయ్యాను. ఇన్నిరోజులు ఇంట్లో ఉండటం నా కెరీర్లోనే మొదటిసారి అనుకుంటా. షూటింగ్‌ల వల్ల నిత్యం ఒక చోటు నుంచి మరో చోటుకు
వెళ్లే నాకు ఇదో కొత్త అనుభవం. పెండ్లయిన తర్వాత కూడా విజయ్, నేను మూడు నెలలపాటు ఒకరినొకరం చూసుకోలేదు. పెండ్లి తర్వాత ఇంట్లోవాళ్లతో గడిపే అవకాశం లభించినందుకు ఒకింత సంతోషంగా ఉంది.
రణబాలితో పాటు ‘మైసా’లో లీడ్ రోల్ చేస్తున్నాను. ఇందులో గోండు తెగకు చెందిన వారియర్‌లా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కఠిన శిక్షణ తీసుకున్నాను. ఇందులో నీటి అడుగున శ్వాస బిగబట్టి చేసే యాక్షన్ సీన్ చేశాను. ఆసియాలోనే ఈ తరహా సీన్ చేసిన తొలి ఫీమెల్ యాక్టర్ నేనే అనుకుంటా.
దేవరకొండ కుటుంబంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మా అత్త స్వీట్‌గా, పసిపాపలాగా అమాయకంగా ఉంటుందని నేను ముద్దుగా ఆమెను ‘పాపా’ అని పిలుస్తాను. విజయ్‌కు సీరియస్ డ్రామాలు, షోలంటే ఇష్టం. నాకేమో కొరియన్ డ్రామాలు అంటే పిచ్చి. ఇప్పుడు ఆయనకు కూడా కే-డ్రామాలు అలవాటు చేశాను.
నా దృష్టిలో సక్సెస్ అంటే పర్ఫెక్ట్ ఇమేజ్ కాదు. ఎంత ఎదుగుతున్నా సరే మనం మనలా ఉంటూ ప్రేక్షకులతో నిజాయతీగా ఉండటమే. అలాంటి నిజాయతీని ఎప్పటికైనా ప్రేక్షకులు గుర్తిస్తారు.
బిజీ షెడ్యూల్లో కాస్త తీరిక దొరికినప్పుడు స్కిన్, హెయిర్ కేర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటా. ఏ మాయిశ్చరైజర్, హెయిర్ కండీషనర్ అవసరం లేదు. వీలు దొరికినప్పుడల్లా నేను ఇదే చేస్తా. ఇది మా అమ్మమ్మ, అమ్మ చెప్పిన చిట్కా.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

