GV Prakash Kumar | సర్జరీ పోస్ట్కు స్పందించి రూ.50 వేలు సాయం చేసిన జీవీ ప్రకాశ్.. ఆన్లైన్ విరాళాలపై నెటిజన్ల హెచ్చరిక!
GV Prakash Kumar | సోషల్ మీడియాలో ఓ వ్యక్తి సర్జరీ కోసం ఆర్థిక సహాయం కోరుతూ చేసిన పోస్ట్ వైరల్గా మారాగా దీనిపై స్పందించిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ ఆర్థిక సహాయం అందించాడు.
GV Prakash Kumar | సోషల్ మీడియాలో ఓ వ్యక్తి సర్జరీ కోసం ఆర్థిక సహాయం కోరుతూ చేసిన పోస్ట్ వైరల్గా మారాగా దీనిపై స్పందించిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ ఆర్థిక సహాయం అందించాడు.
12 గంటలకు పైగా సర్జరీ జరుగుతోంది.. పీఎస్జీ హాస్పిటల్లో ఐసీయూ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి.. లక్ష రూపాయలు అవసరం అంటూ మహా శ్రీనివాస్ పేరుతో విరాళాల కోసం విజ్ఞప్తి చేశాడు ఒక నెటిజన్. అయితే ఈ పోస్ట్పై వెంటనే స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ‘X’ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. “బెస్ట్ ఆఫ్ లక్.. నా వంతు చిన్న సహాయం. ఇది నిజమైనదే అని ఆశిస్తున్నా అని జీవీ ప్రకాశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట విస్తృతంగా షేర్ అవుతుండగా, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఆర్థిక సహాయ అభ్యర్థనలపై అప్రమత్తంగా ఉండాలని, పేషెంట్ వివరాలు, హాస్పిటల్ డాక్యుమెంట్లు పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే సహాయం చేయాలని పలువురు సూచిస్తున్నారు.
Best of luck a small help from my side . Hope it’s authentic pic.twitter.com/9SYOjM2ohk
— G.V.Prakash Kumar (@gvprakash) June 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

