kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?

kgf – kaikala satyanarayana | బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమా కేజీఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. కన్నడ నుంచి కూడా అద్భుతమైన సినిమాలు వస్తాయని నిరూపించింది. బాహుబలి 2 కోసం అప్పట్లో ఆడియన్స్ ఎలా ఎదురుచూశారో.. ఇప్పుడు కేజీఎఫ్ 2 కోసం కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. అంతలా హిట్ అయింది. ఈ సినిమా. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కు ఒక సంబంధం ఉంది. అదేంటని అనుకుంటున్నారా? టైటిల్ కార్డ్స్ పడటానికి ముందు కైకాల సత్యనారాయణ సమర్పించు అని వస్తుంది. ఈ విషయాన్ని చాలామంది గమనించకపోయి ఉండొచ్చు. ఎంతోకాలంగా కైకాల సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కదా. ఇంతకీ ఆయన పేరు సినిమా ముందు ఎందుకు వేశారని అనుమానం వస్తుందా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం..
తన సినీ కెరీర్లో కైకాల సత్యనారాయణ ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రల్లో మెప్పించాడు. వయోభారంతో ఇప్పుడు ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ కైకాల సత్యనారాయణ ఒకప్పుడు రమా ఫిలింస్ అనే బ్యానర్‌తో సినిమాలను కూడా నిర్మించాడు. కైకాల తర్వాత ఆయన వారసుడు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన శాండిల్‌వుడ్‌లో నిర్మాణరంగంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాకు సహ నిర్మాతగా ఉన్నాడు. ఆ సమయంలోనే సినిమా హిట్ అవుతుందని అంచనా వేసిన కైకాల తనయుడు తెలుగు రైట్స్ కోసం పోటీపడ్డాడు. అయితే టాలీవుడ్లో సాయి కొర్రపాటి వంటి టాప్ ప్రొడ్యూసర్ తోడు అంటూ సినిమాకు క్రేజ్ వస్తుందని భావించాడు. దీంతో ఆయనతో కలిసి తెలుగులో కేజీఎఫ్ సినిమాను విడుదల చేశాడు. అలా తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ దాదాపు రూ.18 కోట్ల రూపాయల షేర్‌ను కూడా వసూలు చేసింది. ఈ సినిమా సమయంలోనే కేజీఎఫ్ యూనిట్.. కైకాల సత్యనారాయణకు సన్మానం కూడా చేసింది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Critical condition | సీనియర్ నటుడు కైకాల పరిస్థితి విషమం
kaikala satyanarayana | కైకాలను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
Amitabh Bachchan: అమితాబ్ రోల్స్ రాయ్స్ కారుతో కేజీఎఫ్‌కు లింకేంటి ?
Rakul: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. అందరు సురక్షితం
Actress | ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం.. అన్ని ఇండస్ట్రీలు మావే అంటున్న హీరోయిన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

