ఆరుపదుల వయస్సులోను మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెం 150 చిత్రం తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. చిరు నటించిన ఆచార్య చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా, అది కూడా పూర్తి చేస్తున్నాడు చిరు. ఇక తను కమిటైన సినిమాలను పూర్తి చేసే పనిలో ప్రస్తుతం చిరు బిజీగా ఉన్నాడు.
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ సినిమాని చిరు ఇప్పటికే పట్టాలెక్కించారు. ఈ షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీ తో 154 వ సినిమా సెట్లో అడుగుపెట్టారు. ఇక ఈ రెండు కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ ని పట్టాలెక్కించారు. డిసెంబర్ లోనే ఈ నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారు.
ఒకవైపు ఈ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ మరోవైపు ఆచార్యకు సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. అలానే గ్యాప్ లో పలు ఈవెంట్స్‌లో సందడి చేస్తూ చిరంజీవి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. మెగాస్టార్ ఎనర్జీని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఏదిఏమైనా మెగాస్టారా .. మజాకానా అని మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
All Time MEGA Record ✌🏻#Megastar @KChiruTweets #MegaFeat in the month of December sets a new all time record in the World.
— BA Raju's Team (@baraju_SuperHit) December 6, 2021
One Megastar shooting 4️⃣ films in a month#Chiru152 #Acharya#Chiru153 #GodFather#Chiru154 #Chiru155 #BholaaShankar#MegaDecember #MegaFeast pic.twitter.com/GEXh8oSJhC