Tollywood | 2022లో ఆ నలుగురు హీరోల ట్రిపుల్ బొనాంజా..

Tollywood | ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తేనే చాలు అనుకుంటున్నారు అభిమానులు. అలాంటిది ఒకే ఏడాది మూడు సినిమాలతో వస్తానంటే అంతకంటే కావాల్సింది మరొకటి ఏముంది. తాజాగా 2022 లో ముగ్గురు నలుగురు హీరోలు ఇదే చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఒక్కొక్కరి నుంచి ఏకంగా మూడు సినిమాలు విడుదల కానున్నాయి మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ, రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ నలుగురు హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం అన్నీ షూటింగ్ చివరి దశలోనే ఉన్నాయి. దాంతో అన్ని సినిమాలు తక్కువ గ్యాప్ లోనే విడుదల కానున్నాయి.
ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే 2022 ఫిబ్రవరి 4న ఈయన నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల కానుంది. ఇది వచ్చిన రెండు మూడు నెలల వ్యవధిలోనే గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక 2022 దసరాకు వేదాళం రీమేక్ భోళా శంకర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు కూడా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్.
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఖిలాడి 2022 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మార్చిలో రామారావు ఆన్ డ్యూటీ విడుదల కానుంది. ఇక ఏడాది మధ్యలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్న ధమాకా విడుదల కానుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2022 చివర్లో మరో సినిమాను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ప్రభాస్ కూడా 2022లో మూడు సినిమాలతో రాబోతున్నాడు. జనవరి 14న ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే ఆగస్టు 11న ఆది పురుష్ విడుదల కానుంది. సలార్ సినిమా కూడా 2022 లోనే విడుదల కావడం ఖాయం. మొత్తానికి ఈ నలుగురు హీరోలు 2022ను పూర్తిగా కబ్జా చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

