శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..

Friday releasing movies in Theaters and OTTs | శుక్రవారం వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు సందడి చేస్తాయి. అందులోనూ పండగ వచ్చింది అంటే సినిమాల విడుదల చేయడానికి అంతకంటే మంచి సమయం ఇంకోటి లేదు అని నిర్మాతలు ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రతీ ఏడాది చివర్లో ఎప్పుడు క్రిస్మస్ వీకెండ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. హై బడ్జెట్ హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు, తమిళంలో కూడా మంచి సినిమాలు క్రిస్మస్ పండక్కి వస్తుంటాయి. హాలీడేస్ కూడా ఎక్కువగా ఉండడంతో వాటిని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఈ డిసెంబర్ చివరి వారం కూడా అలాగే చాలా సినిమాలు వస్తున్నాయి.
అందులో ముఖ్యంగా అందరి కళ్ళు నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాపై ఉన్నాయి. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సాయి పల్లవి, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. బెంగాల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డిసెంబర్ 24న నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరోవైపు అదే రోజు 83 సినిమా కూడా విడుదలవుతుంది. రణవీర్ సింగ్, కబీర్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియన్ క్రికెట్ హిస్టరీ మార్చేసిన 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.
ఇక ఇదే వారం ది మ్యాట్రిక్స్ డిసెంబర్ 22న విడుదల కానుంది. సప్తగిరి హీరోగా నటించిన గూడుపుఠాని, రాంగోపాల్ వర్మ దిశ ఎన్ కౌంటర్ ఆధారంగా చేసిన ఆశ ఎన్కౌంటర్, నూతన నటీనటులతో తెరకెక్కిన విక్రమ్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన అతరంగి రే డిసెంబర్ 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. మలయాళంలో టివోనో థామస్ హీరోగా నటించిన మిన్నల్ మురళి నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇలా ఈ క్రిస్మస్ వీకెండ్ వరుస సినిమాలతో సందడి సందడిగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

