ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది

Raviteja vs Balayya | తెలుగు ఇండస్ట్రీలో గత 15 ఏండ్లుగా ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. ఒక హీరోయిన్ విషయంలో బాలకృష్ణ, రవితేజ మధ్య పెద్ద గొడవ జరిగిందని.. ఆ సమయంలో కోపం తట్టుకోలేక రవితేజపై బాలయ్య చేయి చేసుకున్నాడని కొన్నేండ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ ప్రత్యక్షంగా స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ నిజమేనని చాలామంది అనుకుంటున్నారు. అయితే తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న వార్తలపై ఈ ఇద్దరు హీరోలు తాజాగా స్పందించారు. ఆ వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్‌షోకు తాజాగా రవితేజ హోస్ట్‌గా వచ్చాడు. ఈ వేదికపై తమ ఇద్దరి మధ్య ఉన్న గొడవ గురించి రవితేజను అడిగేశాడు బాలయ్య. దీనికి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు నీతో ఒక క్లారిటీ కావాలి బాసూ.. మన ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయింది అంట కదా.. అని రవితేజను అడిగేశాడు బాలకృష్ణ. దానికి మాస్ మహారాజా రవితేజ కూడా అంతే ఫన్నీగా సమాధానం చెప్పాడు. పనీపాటా లేని కొందరు రాసిన తప్పుడు వార్తలు అవి అంటూ ఇద్దరూ కొట్టిపారేశారు.
నిజానికి భద్ర సినిమా సమయంలో హీరోయిన్ మీరా జాస్మిన్ విషయంలో బాలకృష్ణ, రవితేజ మధ్య పెద్ద గొడవ జరిగిందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. రవితేజపై బాలయ్య చేయి కూడా చేసుకున్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ గొడవల కారణంగానే.. బాలకృష్ణ సినిమా వస్తున్నప్పుడు తన సినిమాను కూడా రవితేజ రిలీజ్ చేస్తున్నాడని అంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత దీనిపై ఇద్దరు హీరోలు ఒక దగ్గర కూర్చుని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Raviteja Remuneration | రవితేజ వరుస సినిమాలు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
విలన్‌గా నటించేందుకు ఓకే చెప్పిన బాలయ్య.. కాకపోతే అదొక్కటే కండీషన్
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aha ott
- Balakrishna
- balayya
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

