విలన్‌గా నటించేందుకు ఓకే చెప్పిన బాలయ్య.. కాకపోతే అదొక్కటే కండీషన్

Balakrishna as villain | పాత్ర కోసం ప్రాణం పెట్టే నటులు చాలా తక్కువగా ఉంటారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దేనికైనా సిద్ధం అనుకునే హీరోలు అరుదుగానే దొరుకుతుంటారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు అయితే క్యారెక్టర్స్ కోసం తాము మారిపోవడం కాదు.. తమ కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలని చెప్తుంటారు. అభిమానులకు నచ్చేలా వాళ్లు ఉండటంలో తప్పు లేదు కూడా. అయితే కొందరు హీరోలు మాత్రం అలా కాదు.. వాళ్లు డైరెక్టర్స్ హీరోలన్నమాట. అంటే దర్శకుడు సముద్రంలో దూకమని చెప్పినా కూడా మరో మాట మాట్లాడకుండా వెళ్లి దూకేస్తుంటారు. బాలకృష్ణ ఈ తరహా హీరోనే. సెట్లో దర్శకుడి మాట ఆయనకు వేదవాక్కు. అలాంటి నటసింహం ఇప్పుడు తెలుగు దర్శకులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. ఈ మధ్యే అఖండ సినిమాతో వచ్చి అఖండమైన విజయం అందుకున్న బాలయ్య.. తన మనసులోని కోరిక బయటపెట్టాడు.

సినిమాలతో పాటు ఈ మధ్య ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ అదిరిపోయే టాక్ షో చేస్తున్నాడు. ఆహా కోసం చేస్తున్న ఈ షో నిజంగానే వ్యూస్ పరంగా ఆహా అనిపిస్తుంది. తాజాగా ఈ షోకు అఖండ టీమ్ వచ్చారు. తమ సినిమా టీమ్ వచ్చేసరికి బాలయ్య ఉత్సాహం మరో పది రెట్లు ఎక్కువైపోయింది. ప్రగ్యా జైస్వాల్‌తో డ్యాన్సులు కూడా చేశాడు బాలయ్య. శ్రీకాంత్‌తో కలిసి అదిరిపోయే మాస్ డైలాగులు చెప్పాడు. బోయపాటిని ఆట పట్టించాడు.. తమన్ తో కాసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత తనకు విలన్‌గా నటించాలని ఉందంటూ అసలు విషయం చెప్పాడు బాలయ్య.
బాలకృష్ణకు ప్రతినాయకుడిగా నటించడం కొత్తేం కాదు.. గతంలో సుల్తాన్ సినిమాలో విలన్ పాత్ర చేశాడు ఈయన. అయితే అందులో హీరో కూడా బాలయ్యే. ఇప్పుడు కూడా ఇదే మెలిక పెట్టాడు బాలకృష్ణ. తనకు విలన్‌గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ హీరో కూడా తానే అయ్యుండాలని చెప్తున్నాడు. అలాంటి కథలు తీసుకొస్తే నటించడానికి సిద్ధమే అంటున్నాడు ఈయన. మరి బాలయ్యను విలన్‌గా మార్చేంత దమ్మున్న కథను సిద్ధం చేసే దర్శకుడు ఎవరో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నన్ను చూసి ఊహ వణికిపోయింది.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు..
Akhanda Hindi dubbing rights | అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
అఖండ సహా.. 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు..
Dil Raju party Video | బాలకృష్ణ టీంకు దిల్ రాజు ఇంట్లో పార్టీ..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

