బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) హ్యాట్రిక్ కాంబోలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అఖండ (AKhanda). డిసెంబర్ 2 థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అఖండ సక్సెస్‌ను నందమూరి అభిమానులతోపాటు మాస్ ఎంటర్టైనర్లను ఇష్టపడే ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు అఖండ చిత్రం నైజాం, వైజాగ్ ప్రాంతాల్లోని థ్రియాట్రికల్ రైట్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు కేవలం వారం వ్యవధిలోపలే తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకున్నారని లేటెస్ట్ టాక్. అఖండ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిత్రయూనిట్‌కు సోమవారం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని దిల్ రాజు ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో డైరెక్టర్ బోయపాటి కేక్ కట్ చేశారు. పార్టీలో బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్, బోయపాటి శ్రీను, థమన్ తోపాటు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, అఖండ విలన్‌తోపాటు పలువురు ప్రముఖులు సందడి చేశారు.
Blockbuster #Akhanda celebrations at Dil Raju & Shirish’s house. pic.twitter.com/jyU0pC9vab
— Vamsi Kaka (@vamsikaka) December 6, 2021
అఖండ గ్రాండ్ సక్సెస్ మీట్‌కు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు రాగా..తాజాగా దిల్ రాజు ఇంట్లో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్