బాలీవుడ్ (Bollywood) హీరోహీరోయిన్లు విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా కైఫ్ (katrinakaif) ఇంట వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందడి మొదలైంది. రాజస్థాన్ సవాయి మదోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ (Six Senses Hotels Fort Barwara) బర్వారాలో వివాహ వేడుక జరుగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కత్రినాకైఫ్ ముంబైలోని నివాసం నుంచి తన తల్లితో కలిసి కారులో బయలుదేరుతున్న వీడియో ఒకటి రాగా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
కత్రినాకైఫ్ సోదరి నటాషా జైపూర్‌లో ల్యాండ్ అయింది. విక్కీ కౌశల్ పేరుతో ఉన్న ప్లాస్టిక్ బ్యాగును కారులో పెడుతున్న స్టిల్ బయటకు వచ్చింది. ఈ బ్యాగులో ఉన్నది పెళ్లి కొడుకు విక్కీ కౌశల్ షేర్వానీ అని అంతా అనుకుంటున్నారు.
కత్రినాకైఫ్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనైట ష్రాఫ్ వెడ్డింగ్ కోసం జైపూర్‌కు చేరుకున్న స్టిల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బీటౌన్ నుంచి కరణ్ జోహార్, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్‌ధావన్‌తో పాటు విరాట్-అనుష్క కపుల్, ఇతర సెలబ్రిటీలు రానున్నట్టు ఇప్పటివరకున్న టాక్.
కత్రినా-విక్కీ జంట ఇవాళ హోటల్‌కు రానుంది. డిసెంబర్ 7న సంగీత్ సెర్మనీ, 8న మెహిందీ వేడుక, 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు బీటౌన్ వర్గాల సమాచారం. 10వ తేదీన కత్రినా-విక్కీ కౌశల్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
చట్టబద్దంగా భార్యాభర్తలయ్యారా..?
ప్రీ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ లో భాగంగా కత్రినాకైఫ్ కుటుంబసభ్యులు విక్కీ కౌశల్ నివాసానికి వచ్చినట్టుగా బాలీవుడ్ మీడియా కథనం. కాగా ముంబైలో కత్రినా-విక్కీ (Special Marriage Act, 1954) కింద కోర్టు మ్యారేజ్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకొని చట్టబద్దంగా భార్యాభర్తలు అయినట్టుగా తెలుస్తోండగా… దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?