జానపద పాటలతో కెరీర్‌ను ప్రారంభించి తన గొంతుతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించింది యువ గాయని మంగ్లీ (Singer Mangli). అల వైకుంఠపురం చిత్రంలో మంగ్లీ పాడిన రాములో రాములా (Ramulo Ramula) పాట ఏ రేంజ్లో రికార్డు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా పాట వ్యూస్ పంట పండించింది. ఈ సింగింగ్ సెన్సేషన్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
ఇప్పటి వరకు టాలీవుడ్ (Tollywood)లోనే పాటలు పాడిన మంగ్లీ ఇక నుంచి తమిళ ప్రేక్షకులను (Kollywood debut) కూడా ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తమిళ హీరోలు జీవా, మిర్చి శివ నటిస్తోన్న చిత్రంతో మంగ్లీ సింగర్‌గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఆరుళ్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..మంగ్లీతో ఇప్పటికే చెన్నైలోని స్టూడియోలో పాటను రికార్డు కూడా చేశారట మేకర్స్.
తన వాయిస్‌తో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మంగ్లీ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్న ఈ గాయనికి అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Tara Sorry to Payal Rajput | ఆర్ఎక్స్ 100 భామకు తడప్ హీరోయిన్ క్షమాపణలు
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?