ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రంతోపాటు ఆచార్య సినిమాను పూర్తి చేసిన టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan)..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో 15వ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.అయితే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో తీరిక లేకుండా ఉన్న చెర్రీ..షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకున్నట్టు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టిల్ చెబుతోంది. ఈ స్టార్ హీరో స్విట్జర్లాండ్ (Switzerland)ను హాలీడే స్పాట్ కోసం ఎంచుకున్నాడు. అందమైన మంచు పర్వత ప్రాంతంలో నిలబడి కెమెరాకు ఫోజులిచ్చాడు.
సూర్యకిరణాలు (sun kissed pics) కిందకు పడుతుంటే కార్గో ప్యాంట్‌తో బ్లూ కమ్ బ్లాక్ జాకెట్ వేసుకున్న రాంచరణ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ చేస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఈ చిత్రంలో వచ్చే ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు కొన్ని ఫొటోలు కూడా బయటకు రాగా ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. స్విట్జర్లాండ్ టూర్ ముగియగానే మళ్లీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు రాంచరణ్.
Mega Power Star @alwaysRamCharan takes off for a quick vacay to Switzerland with his sister #RamCharan pic.twitter.com/ZMaWFnsxp8
— BA Raju's Team (@baraju_SuperHit) December 2, 2021
ఆచార్య చిత్రంలో సిద్ధ పాత్రలో కనిపించబోతున్నాడు రాంచరణ్. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోలు రోమాలు నిక్కపొడుచుకునేలా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు