Sirivennela | సిరివెన్నెలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల మనస్సులు దోచుకున్న చేబోలు .. కాదు కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు.

Sirivennela | సిరివెన్నెల సినిమాలో.. విధాత తలపున ప్రభవించినది… అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటే ఆయనకు తెలుగు సినీ ప్రేక్షకుల, సంగీత ప్రేమికుల గుండెల్లో చోటు సంపాదించింది. ఎంతో భావ గర్భితమైన ఈ గేయ రచనకు తనకు వారం రోజులు పట్టిందని ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల స్వయంగా చెప్పారు. ఆయన జననీ జన్మభూమి సినిమాతో సినీ గేయ రచయితగా కెరీర్ ప్రారంభించారు.
ధనం మూలం ఇదం జగత్.. అంటే ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది నానుడి. ఎంతో చిన్న చిన్న పదాలతో ధన మాయను తన పాటలో పొదిగించగలరో అంతే సులువుగా దైవ మాయని కూడా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. సామాన్య తెలుగు ప్రజానీకానీకి తెలిసిన, తెలియని సాహిత్య ప్రక్రియలన్నీ పలుకరించి పండుగ చేసుకున్నారు సిరివెన్నెల.
సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. సామాన్య తెలుగు ప్రజానీకానీకి తెలిసిన, తెలియని సాహిత్య ప్రక్రియలన్నీ పలుకరించి పండుగ చేసుకున్నారు సిరివెన్నెల.
ఆయన అసలు పేరు చేబోలు సీతారామశాస్త్రి. సిరివెన్నెల సినిమాకు రాసిన పాటలతో ఆయనకు ఆ సినిమా పేరే ఇంటి పేరైంది. న్యూమోనియాతో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానలో చేరిన సిరివెన్నెల మంగళవారం (2021 నవంబర్ 30) సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

