shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

shiva shankar master | గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ పరిస్థితి విషమించడంతో.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. 74 సంవత్సరాల శివ శంకర్ మాస్టర్ దాదాపు 800 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లో ఈయన పాటలకు నృత్యాలు సమకూర్చారు. ఎక్కువగా సౌత్ సినిమాలకు వర్క్ చేశారు శివశంకర్ మాస్టర్ 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు.
కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్ర వేశారు. 2003లో వచ్చిన ‘ఆలయ్’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్ మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. ఈయన వెండితెరపై కన్పిస్తే చాలు ప్రేక్షకుల మొహాలపై నవ్వులు వచ్చేవి. విభిన్నమైన తన బాడీ లాంగ్వేజ్ తో అందరినీ ఆకట్టుకున్నారు శివ శంకర్ మాస్టర్. చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. ఓంకార్ హోస్ట్ గా వచ్చిన ఛాలెంజ్ డ్యాన్స్ షోకు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్‌గా కొనసాగుతున్నారు.
శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే. తన శిష్యులను కూడా సొంత కొడుకులా చూసుకునే వారు శివ శంకర్ మాస్టర్. ఆయనతో కలిసి పని చేయడానికి ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపించారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో ఆయన కంపోజ్ చేసిన ధీర ధీర పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో పాటు తమిళనాడు స్టేట్ మరో నాలుగు అవార్డులు ఇచ్చి ఆయనను సత్కరించింది. ఎన్నో సినిమాలు చేసినా కూడా చివరి దశలో ఆయన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడటం విచారకరం. అతడిని కాపాడుకోవడానికి చిరంజీవితో పాటు సోనూ సూద్, మంచు విష్ణు లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
shiva shankar master | టాలీవుడ్లో మరో విషాదం.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Sivasankar Master : శివశంకర్ మాస్టర్ కొడుకులు ఏ రంగంలో ఉన్నారో తెలుసా?
ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో అత్యంత ధనవంతుడైన జోనాస్ ఎవరు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

