ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..

30 years industry Prudhvi raj | తెలుగు ఇండస్ట్రీలో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 35 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. అయితే బ్రేక్ మాత్రం పదేళ్ల కింద వచ్చింది. గత కొన్నేళ్లుగా 30 ఇయర్స్ పృథ్వీకి పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈయనకు అవకాశం రావడం లేదు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చేస్తున్న ఈయనకు.. అదే శాపంగా మారింది. ముఖ్యంగా వైసీపీలో ఉన్న ఈయన గత కొన్ని నెలలుగా అనుకోని వివాదాలలో ఉన్నాడు. ఇది కూడా ఆయన కెరియర్ పై భారీ ప్రభావం చూపించింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూ కి హాజరైన పృథ్వీరాజ్ తన కెరీర్లో జరిగిన ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ఈయన గండిపేట రహస్యం అనే సినిమా చేశాడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్. అందులో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటించాడు ఈ కమెడియన్. నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. సీనియర్ ఎన్టీఆర్ పై ఎన్నో విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది గండిపేట రహస్యం సినిమా. ఈ సినిమా విడుదలైనప్పుడు నందమూరి అభిమానులు ఊగిపోయారు. సినిమా యూనిట్ ఎవరు దొరికినా కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో ఒక థియేటర్ కు పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డి కలిసి వచ్చారు. వాళ్లు వచ్చారన్న విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు వాళ్లపైకి దాడి చేయడానికి పరుగులు పెట్టారు.
అయితే అక్కడే ఉన్న నందమూరి హరికృష్ణ వాళ్లను కాపాడాడు. తన కారులో పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డిని ఎక్కించుకుని వేరే దగ్గరికి తీసుకెళ్లాడు. అలా ఆ రోజు ఇద్దరు దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ విషయం స్వయంగా పృథ్వీరాజ్ చెప్పాడు. ఆ రోజు గాని హరికృష్ణ లేకపోయి ఉంటే కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేసే వాళ్లు అంటున్నాడు ఈయన. అయితే గండిపేట రహస్యం సినిమా విడుదలైన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదని.. పైగా నువ్వు మంచి నటుడిని అవుతావని పెద్దాయన ఆశీర్వదించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు పృథ్వీరాజ్. గండిపేట రహస్యం సినిమా విడుదలైన తర్వాత నాలుగేళ్ల పాటు తనకు సినిమా అవకాశాలు రాలేదని చెప్పాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట
KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా
kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

