టాలీవుడ్లో మరో విషాదం.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

shiva shankar master | టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ( 72) కన్నుమూశారు. కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి. తెలుగు, తమిళ చిత్రాలతో సహా దాదాపు 10కి పైగా భాషల్లో కొరియోగ్రాఫర్‌గా శివశంకర్ మాస్టర్ సేవలందించారు. ఆయన కెరీర్లో 800కు పైగా సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. 1975లో వచ్చిన తమిళ చిత్రం పాట్టు భరతమమ్ చిత్రంతో ఆయన కెరీర్ మొదలైంది. ఈ సినిమాకు ఆయన సహాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత కురువికూడు చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా మారారు. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. 2003లో వచ్చిన ఆలయ్ సినిమాతో తొలిసారి ఆయన వెండితెరపై నటుడిగా కనిపించాడు. నేనే రాజు నేనే మంత్రి, అక్షర, సర్కార్, ఎన్టీఆర్ కథానాయకుడు, రాజుగారి గది 3 సహా దాదాపు 30 చిత్రాల్లో ఆయన నటించారు.బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర పాటకు అందించిన కొరియోగ్రఫీకి గానూ శివశంకర్ మాస్టర్ జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులను సొంతం చేసుకున్నారు. 1996లో పూవే ఉనక్కగ, 2004లో విశ్వ తులసి, 2006లో వరలారు, 2008లో ఉలియిన్ ఓసయ్ చిత్రాలకు గానూ ఈ అవార్డులు అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో అత్యంత ధనవంతుడైన జోనాస్ ఎవరు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

