e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ

shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ

shiva shankar master
shiva shankar master

shiva shankar master | శివశంకర్‌ మాస్టర్‌ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మగధీరలోని ధీర ధీర పాట. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన కొరియోగ్రాఫర్‌గా ఉన్న కూడా నిజం చెప్పాలంటే.. తెలుగులో ఆయనకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం మగధీర. ఆ తర్వాత ఓంకార్ ఛాలెంజ్ షో. ఈ రెండింటితో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు శివ శంకర్ మాస్టర్. ఈయ‌న 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ తల్లిదండ్రులు. తండ్రి కొత్వాల్‌ చావిడిలో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం చేసేవాళ్లు. తమిళనాడు నుంచి వచ్చిన కూడా తెలుగు బాగా అర్థం చేసుకొని తనదైన వాచకంతో అందర్నీ ఆకట్టుకున్నారు శివ శంకర్ మాస్టర్. ఈయ‌న ఉన్న‌ట్టుండి క‌రోనాతో మ‌ర‌ణించ‌డం సినీ ఇండ‌స్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్ర‌మంలోనే చిన్న‌ప్పుడు ఆయ‌న జీవితంలో జ‌రిగిన అతిపెద్ద విషాదం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

శివ శంకర్ మాస్ట‌ర్‌కు ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు.. తనను వాళ్ల పెద్దమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని ఇంటి బయట అరుగుమీద కబుర్లు చెప్పుకునేవారు. ఒకరోజు అరుగు మీద కూర్చొన్న సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చింది. అది తమ మీదకు వస్తుందేమోనని శివ శంకర్‌ పెద్దమ్మ భయపడి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న శివ శంకర్‌ కూడా కింద పడిపోయాడు. దీంతో ఆ ఏడాదిన్నర వయసులోనే ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా సరికాలేదు. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే డాక్ట‌ర్‌ వద్దకు శివ శంకర్‌ను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్ధారించారు. అప్పుడు ఆ డాక్టర్‌ శివ శంకర్‌ తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చారు.

- Advertisement -

‘ఈ పిల్లాడి బాధ్యత కొన్ని సంవత్సరాల పాటు పూర్తిగా నాకు ఇవ్వండి.. ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని అన్నారు. దాంతో ఆ వైద్యుడు మాటలు నమ్మి కొన్ని సంవత్సరాల పాటు శివ శంకర్‌ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు శివ శంకర్‌ పడుకునే ఉన్నారు. ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మళ్లీ లేచి నడిచారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌కు ఎంతో మమకారం. దానిపై ఉన్న ఇష్టంతోనే వెన్నెముక గాయం కూడా లెక్క చేయకుండా నృత్యం నేర్చుకున్నారు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి లెజెండరీ కొరియోగ్రాఫర్ అయ్యారు శివ శంకర్ మాస్టర్. భౌతికంగా ఆయన లేకపోయినా కూడా శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటల రూపంలో ఎప్పుడు బతికే ఉంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

shiva shankar master | టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్‌ క‌న్నుమూత‌

shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Sivasankar Master : శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కొడుకులు ఏ రంగంలో ఉన్నారో తెలుసా?

ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..

Sree Leela Break| సినిమాల‌కు పెళ్లి సంద‌D హీరోయిన్ బ్రేక్‌ ..కార‌ణ‌మేంటో తెలుసా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో అత్యంత ధన‌వంతుడైన జోనాస్ ఎవ‌రు?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement