హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తాను ప్రజా జీవితంలోకి వచ్చి సుమారు 20 ఏండ్లు గడిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు గుర్తు చేసుకున్నారు. అమెరికాలో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సామాన్యులతో కలిసి నడిచిన మధుర స్మృతులను తలచుకున్నారు. 2006లో రాష్ట్ర సాధనోద్యమంలో తాను పాల్గొన్న ఒక ఫొటోను శనివారం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. కేటీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలుపంచుకున్న ఘటనలతో కూడిన వీడియోలు, ఫొటోలను పలువురు అభిమానులు ఎక్స్‌లో పోస్టు చేశారు.