ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitaramasastri) మృతి పట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ (Tollywood) సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, థమన్ (Thaman), నటులు ప్రకాశ్ రాజ్ ( prakashraj), మహేశ్ బాబుతోపాటు పలువురు టాలీవుడ్ తారలు సంతాపాన్ని ప్రకటించారు.
‘లెజెండ్ ఇక లేరు..’ అంటూ సిరివెన్నెలతో కలిసి దిగిన ఫొటోను థమన్ ట్విటర్ లో షేర్ చేశాడు.
THE LEGEND IS NO MORE 🥺
— thaman S (@MusicThaman) November 30, 2021
REST IN PEACE #Seetharamasastry gaaru #RipSirivennellaSeetharamasastry gaaru pic.twitter.com/kyW5gipXTb
‘జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది…మా జీవితాలకు అర్థాన్ని జోడించిన మీ కవితా భావనలకు ధన్యవాదాలు.. మీరు ఉత్తమ గురూజీ భరించలేని నష్టం..’ అంటూ ట్విటర్ లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు ప్రకాశ్‌రాజ్.
జగమంత కుటుంబం మీది
— Prakash Raj (@prakashraaj) November 30, 2021
మీరు లేక
ఏకాకి జీవితం మాది…🙏. Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI #SirivennelaSitaramasastry garu #RIP pic.twitter.com/JucPDYiVTa
తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టు అనిపిస్తుంది..మన పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా..?మనసుకి నొప్పిగా ఉంది గురువుగారు..అంటూ ఆర్పీ పట్నాయక్ తన సంతాప సందేశంలో తెలిపారు.
గురువుగారు, ఎంటి ఇలా చేసారు…. తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టు అనిపిస్తుంది….. మన పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా….మనసుకి నొప్పిగా ఉంది గురువుగారు…. pic.twitter.com/EQ09nynlFB
— rp patnaik (@rppatnaik) November 30, 2021
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా..రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి..అని సిరివెన్నెల ఫొటోతో ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
— Jr NTR (@tarak9999) November 30, 2021
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/O1fgNJEqau
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త విని చాలా నిరుత్సాహపడ్డాను. ఆయన ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..సిరివెన్నెల ఆత్మక శాంతి కలుగుగాక..అంటూ వెంకటేశ్ ట్వీట్ చేశాడు.
Disheartened to hear that Sirivennela Seetharama Sastry garu is no more. Deepest condolences to his loved ones. May his soul rest in peace. 🙏
— Venkatesh Daggubati (@VenkyMama) November 30, 2021
మా పరిశ్రమకు మీరు చేసిన అసమానమైన సహకారానికి ధన్యవాదాలు. మీరు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. మీతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవం. ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ హీరో రామ్ ట్వీట్ చేశాడు.
Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. 💔#RAPO pic.twitter.com/NbOHj8wc5F
— RAm POthineni (@ramsayz) November 30, 2021
సిరివెన్నెల ఇక లేరనే వార్త చాలా బాధాకరం..ముందు నుంచి నా కెరీర్లో భాగమయ్యారు..ఆయన మాటలు ఆయనను మన సంగీతంలో శాశ్వతంగా ఉంచుతాయి. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలుగుగాక..అంటూ అల్లర నరేశ్ట్వీట్ చేశాడు.
Deeply saddened by the news that #SirivennelaSeetharamaSastry garu is no more. He has been a part of my career right from the beginning – his words will keep him in our music forever. May his soul rest in peace. 🙏
— Allari Naresh (@allarinaresh) November 30, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు