హున్సాలో రేపు పిడిగుద్దులాట
హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ అనందంలో మునిగిపోతారు. కానీ సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా బుధవారం పిడిగుద్దులాట నిర్వహించనుండగా, ఇందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు.
- ఏర్పాట్లు చేసిన గ్రామస్తులు అనాదిగా వస్తున్న ఆచారం
బోధన్ రూరల్, మార్చి 2: హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ అనందంలో మునిగిపోతారు. కానీ సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా బుధవారం పిడిగుద్దులాట నిర్వహించనుండగా, ఇందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. హోలీ పండుగ వచ్చిందంటే చాలు గ్రామంలో సందడి నెలకొంటుంది. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. పిడిగుద్దులాట బయటివారికి వింతగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం ఆచారంగా భావిస్తారు. ఈ ఆటను ఎంతో ఇష్టంతోఆడుతారు.
ఆటను ఎలా ఆడుతారు?
పిడిగుద్దులాట బాక్సింగ్‌ను తలపిస్తుంది. కొన్నేండ్లుగా ఈ ఆటను ఆడడం ఆచారంగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం చంద్ర గ్రహణం ఉండడంతో హోలీ సంబురాలు, పిడిగుద్దులాటను బుధవారం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహించిన అనంతరం హనుమాన్ మందిరం వద్ద పిడిగుద్దులాటను జరుపుకొంటారు. రెండు వర్గాలుగా విడిపోయి మధ్యలో పెద్దతాడును అడ్డంగా కడతారు. తాడును రెండు వైపులా మోహరించిన గ్రామస్తులు సుమారు 5 నుంచి 10 నిమిషాలపాటు కొట్టుకుంటారు. ఈ ఆటలో ఎలాంటి గాయాలైనా మందుల జోలికి వెళ్లరు. అక్కడి మట్టిని గాయాలకు రాసుకుంటే తగ్గిపోతాయని వారి నమ్మకం. పిడిగుద్దులాట తర్వాత ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ ఆటను ఆడకుంటే గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Holi
- Holi festivalm
- Villagers
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

