న్యూఢిల్లీ, మార్చి 2: కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత నకిలీ కోర్టు తీర్పుల్ని ఓ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోవటం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ‘ఉనికిలో లేని ఏఐ ఆధారిత నకిలీ తీర్పులతో కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం తప్పు మాత్రమే కాదు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన, చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ అంశాన్ని సవివరంగా పరిశీలించి ఏజీ ఆర్ వెంటకరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు పంపుతామని తెలిపింది. ఈ అంశంలో సుప్రీంకోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్‌ను నియమించింది.