కన్నడ సోయగం రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం పుష్ప (Pushpa) సినిమాలో ఫీ మేల్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ (Tollywood) స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తోంది. పుష్పపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన శ్రీ వల్లి సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీవల్లి పాత్రలో నటించేందుకు ఎలా ప్రిపేర్ అయిందో చెప్పుకొచ్చింది రష్మిక. శ్రీ వల్లి పాత్ర కోసం చాలా పరిశోధనలు చేశా. నా పాత్రకు తగ్గట్టుగా పల్లెటూరి అమ్మాయిల తీరుతెన్నులు, వారి వ్యక్తీకరణలను నేర్చుకున్నానని చెప్పింది రష్మిక. గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణ వాసుల జీవనశైలి, వారి బాడీ లాంగ్వేజ్, నడవడికను అర్థం తెలుసుకునేందుకు తిరుపతి సమీపంలోని ఒక గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడినట్టు చెప్పుకొచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తమ్ శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. రెండు పార్టులుగా రాబోతుంది పుష్ప.
ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?