Akhanda | అఖండ ప్రభంజనం..పుష్ప, ఆర్ఆర్ఆర్కు కలిసొస్తుందా..?
థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అఖండ (AKhanda) సినిమా రేంజ్‌ను ఆకాశానికెత్తేశాయి. సెకండ్ పార్టులో వచ్చే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.

బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ (AKhanda). విడుదలైన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాను రేంజ్‌ను ఆకాశానికెత్తేశాయి. సెకండ్ పార్టులో వచ్చే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. బాక్సాపీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబడుతూ సినిమా థియేటర్లకు మంచి రోజులొచ్చాయనే సంకేతాలిస్తోంది అఖండ. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో భారీ బడ్జెట్ సినిమాల్లో మరింత జోష్ నింపుతోందని పలువురు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
పెద్ద చిత్రాల్లో ప్రధానంగా పుష్ప (Pushpa), ఆర్ఆర్ఆర్ (RRR) ఉన్నాయి. పుష్ప ఈ నెల 17న విడుదల కానుండగా..ఆర్ఆర్ఆర్ 20 రోజుల తర్వాత రిలీజ్ కానుంది. మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన అఖండ ప్రభంజనం సృష్టించడం పక్కా అని తెలుస్తోండగా..పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా ప్రేక్షకులు భారీగానే తరలివస్తారని భావిస్తున్నారట మేకర్స్. సెకండ్ లాక్డౌన్ తర్వాత లవ్‌స్టోరీ సినిమా ఒక్కటే హౌస్‌ఫుల్‌గా మంచి టాక్‌తో నడించింది. ఆ తర్వాత థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు అంతంత మాత్రంగానే వెళ్తున్నారు.

చాలా రోజుల తర్వాత ఇపుడు అఖండ చిత్రానికి ఆడియెన్స్ తాకిడి పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే థియేటర్లలో సందడి ఉంటుందని బడా నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. మరి అఖండ థియేటర్లను మళ్లీ గాడిలో పడేస్తుందా..? లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

