టాలీవుడ్ (Tollywood) యాక్టర్ బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable). ఈ ‘ఆహా’ (Aha OTT) టాక్ షోలో మోహన్ బాబు, న్యాచురల్ స్టార్ నాని ఇప్పటికే సందడి చేశారు. త్వరలోనే మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఈ షోలో మెరువ బోతున్నాడన్న వార్త ఇప్పటికే హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. తాజాగా చక్కర్లు కొడుతున్న అప్డేట్ నందమూరి అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఈ షోలో బాలకృష్ణతో కలిసి అబ్బాయి కూడా సందడి చేయబోతున్నాడట. ఇంతకీ అబ్బాయి అంటే మోక్షజ్ఞ అనుకునేరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR). అన్ స్టాపబుల్ షోలో ఎన్టీఆర్‌ను తీసుకొచ్చే విషయమై మేకర్స్ చర్చలు జరుపగా..తారక్ పాజిటివ్‌గా స్పందించినట్టు టాక్. మొత్తానికి అన్నీ కుదిరితే వీలైనంత త్వరలో బాబాయి-అబ్బాయి తళుక్కుమనడం ఖాయమైనట్టే. మరి ఈ వార్తలపై ఎన్టీఆర్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
మరి బాలయ్య, ఎన్టీఆర్ ఎలాంటి డిష్కషన్స్ తో షోను నడిపిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు