Bala Krishna: చిన్నారితో బాలకృష్ణ ఫన్.. వైరల్‌గా మారిన వీడియో

చాన్నాళ్ల తర్వాత తమ అభిమాన నటుడు బాలకృష్ణ నుండి మాసివ్ హిట్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అభిమాన నటుడికి సంబంధించిన పాత వీడియోలు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇందులో బాలయ్య లుంగీ కట్టుకొని చిన్నారితో సరదాగా టైం స్పెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
చిన్న పాప తో బాలకృష్ణ ప్రేమగా ఉన్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. అఖండ చిత్రం షూటింగ్ సమయం లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటుంది. కాగా, సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. చిత్రానికి సంగీతం థమన్ అందించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటోంది. వసూళ్ల పరంగాను దూసుకుపోతోంది. తొలి రోజున నైజామ్ వరకూ ఈ సినిమా 4.37 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి షేర్ రావడం గొప్ప విషయంగానే చెప్పుకుంటున్నారు. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు.
He is a lovely ❤️😍#NandamuriBalakrishna #Balayya#Akhanda #AkhandaMassJathara pic.twitter.com/AbdiRhXBp4
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 3, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhanda
- bala krishna
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

