Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ (akhanda)ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఓవర్సీస్లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ అఖండను ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ (akhanda)ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. బోయపాటి శ్రీను (Boyapati Sreenu), బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రం హౌస్‌ఫుల్ తో హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. డిసెంబర్ 1న యూఎస్ఏతోపాటు ఇతర కేంద్రాల్లో ప్రీమియర్ షోలు పడగా..జెట్ స్పీడులో దూసుకెళ్తోంది అఖండ. ఓవర్సీస్లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ అఖండను ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది.
యూఎస్ఏ ప్రీమియర్స్ తో కలిపి ఓవర్సీస్లో 500కు పైగా లొకేషనల్లో విడుదలైంది. అన్ని చోట్లా ప్రీ సేల్స్ లో గర్జిస్తోంది అఖండ. డిసెంబర్ 1 వరకు అఖండ రూ.200 యూఎస్ డాలర్లు ప్రీ సేల్స్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ ప్రండితుల అంచనా. ట్రెండ్స్ ను బట్టి చూస్తే 2021లో ఓవర్సీస్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ చేసిన చిత్రంగా నిలిచినట్టు స్పష్టమవుతోంది. సినిమా ప్రమోషన్స్, పాజిటివ్ టాక్ తో అఖండ మంచి బిజినెస్ చేయడం పక్కా అని తెలుస్తోంది.
ఎస్ థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని ఇప్పటివరకు వినిపిస్తున్న టాక్. ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..పూర్ణ (Poorna)కీలక పాత్ర పోషించింది. తాజాగా యూఎస్‌లో అఖండ చేసిన ప్రీ ట్రేడ్ బిజినెస్ తోపాటు రానున్న రోజుల్లో చేయబోయే కలెక్షన్ల వేట విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

