రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ అద్దాలు ధ్వంసం
చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల నూతన హాస్టల్ భవనంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హాస్టల్ భవనంలోని కిటికీలకు ఏర్పాటు చేసిన అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు తరచూ ధ్వంసం చేస్తున్నారు. గతంలోనూ...
– కొరవడిన పోలీసుల నిఘా.. ఆకతాయిల ఆగడాలు
– గంజాయి, మద్యం సేవనానికి అడ్డాగా మారిన ప్రాంగణం
రుద్రంపూర్, నవంబర్ 24 : చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల నూతన హాస్టల్ భవనంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హాస్టల్ భవనంలోని కిటికీలకు ఏర్పాటు చేసిన అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు తరచూ ధ్వంసం చేస్తున్నారు. గతంలోనూ అద్దాలను పగలగొట్టగా కళాశాల అధికారులు తిరిగి వాటిని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మరోసారి అద్దాలను ధ్వంసం చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా హాస్టల్ భవనాన్ని నిర్మించినప్పటికీ, పనులు పూర్తిస్థాయిలో ముగియక పోవడంతో ఇప్పటివరకు విద్యార్థులకు కేటాయించలేదు. దీంతో భవనం, పరిసర ప్రాంతాలు ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి, మద్యం సేవించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ అద్దాలు ధ్వంసం
AP SEC | పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు : ఏపీ ఎస్ఈసీ
‘కొత్తగూడెం ఇంటి పట్టాల పంపిణీ అవినీతిపై ఎమ్మెల్యే స్పందించాలి’
‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

