టాలీవుడ్ (Tollywood) స్టార్ సెలబ్రిటీలు మహేశ్ బాబు (Mahesh Babu), వంశీపైడిపల్లి (Vamshi Paidipally) అనుబంధం గురించి సినీ జనాలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేశ్‌బాబు, వంశీపైడిపల్లి కుటుంబాలు వీలు దొరికినపుడల్లా ఒక్కచోట చేరి సరదా సమయాన్ని గడుపుతుంటాయి. తాజాగా మరోసారి ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి సందడి చేసిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహేశ్-నమ్రత కపుల్ శనివారం రాత్రి తమ సన్నిహితులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. వీరిలో స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి కుటుంబసభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వంశీపైడిపల్లి సతీమణి మాలిని, రామ్ జూపల్లి, మేఘనారావు అంతా కబుర్లు చెప్పుకున్నారు. స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో స్టార్ హీరో మహేశ్ బాబు జరుపుకున్న పార్టీ ఫొటో ఇపుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. మహర్షి సినిమాతో వంశీపైడిపల్లి, మహేశ్ కుటుంబాల మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఈ ఇద్దరు తమ సంతోషకర క్షణాలను ఒకరికొకరు పంచుకుంటుంటారు.
About Last Night Fun Evenings good times – #NamrataShirodkar via @instagram
— BA Raju's Team (@baraju_SuperHit) December 5, 2021
Superstar @urstrulyMahesh #SarkaruVaariPaata #SSMB pic.twitter.com/Cq7WW221Ds
మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం2022 ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నాడు మహేశ్ బాబు.
ఇవి కూడా చదవండి..
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Tara Sorry to Payal Rajput | ఆర్ఎక్స్ 100 భామకు తడప్ హీరోయిన్ క్షమాపణలు
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?