టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి భీమ్లా నాయక్ (Bheemla Nayak). మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ (Ayyappanum Koshiyum)కు ఇది రీమేక్. బిజూ మీనన్ పోషించిన అయ్యప్పన్ నాయర్ పాత్రను పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పోషిస్తుండగా..పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)చేసిన హవాల్దార్ కొషి కురియన్ పాత్రలో రానా (Rana ) నటిస్తున్నాడు.
తాజాగా పృథ్విరాజ్ సుకుమారన్ భీమ్లానాయక్ యాక్టర్ రానాతో కలిసి దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు కలవడం వెనుక స్పెషల్ ఏమైనా ఉందా..? అనే కదా మీ డౌటు. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో బ్రో డాడీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. రానా షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి పృథ్విరాజ్తో ఫొటో దిగాడు. రానా ఈ చిత్రంలో డానియల్ శేఖర్ పాత్రలో కనిపించబోతుండగా..ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోకు అద్బుతమైంన స్పందన వస్తోంది.
కోలీవుడ్ భామ నిత్యమీనన్, మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్‌తోపాటు మిగిలిన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది.
ఇవి కూడా చదవండి..
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?