Samyukta Menon | రానా భార్య పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ..!
టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).రానా సరసన నటించే భామ గురించి మరో పేరు తెరపైకి వచ్చింది. మలయాళ నటి సంయుక్తా మీనన్ (Samyukta Menon) భీమ్లానాయక్ లో రానా భార్యగా కనిపించనుందట.

టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak). త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా..సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తోపాటు భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ కు విశేషమైన స్పందన వస్తోంది. థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ట్రాక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు జోడీగా నిత్యమీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే రానా (Rana)కు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ కనిపించబోతున్నదని ఇప్పటివరకున్న టాక్ కాగా..దీనిపై మాత్రం అధికారిక ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. తాజాగా రానా సరసన నటించే భామ గురించి మరో పేరు తెరపైకి వచ్చింది. మలయాళ నటి సంయుక్తా మీనన్ (Samyukta Menon) భీమ్లానాయక్ లో రానా భార్యగా కనిపించనుందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే పెండింగ్ లో ఉందని టాలీవుడ్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో రానా డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ చిత్రానికి రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భీమ్లానాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఇవి కూడా చదవండి..
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

