నన్ను చూసి ఊహ వణికిపోయింది.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

Srikanth in Akhanda | సీనియర్ హీరో శ్రీకాంత్‌కు తెలుగు ఇండస్ట్రీలో సాఫ్ట్ ఇమేజ్ ఉంది. 100 సినిమాలకు పైగా నటించిన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించారు. అందుకే ఆయనకు సాఫ్ట్ ఇమేజ్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈయనను బాగా అభిమానిస్తారు. అలాంటి హీరో ఈ మధ్యే బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. తనకు అలవాటు లేని పాత్ర అయినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేశాడు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం శ్రీకాంత్‌ను అలా విలన్‌గా చూడటానికి ఇష్టపడట్లేదు. ఈయన రోల్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో అఖండ సినిమాలో తన పాత్ర గురించి వస్తున్న రెస్పాన్స్‌పై శ్రీకాంత్ స్పందించాడు.

అఖండ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం తనకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన విషయం అంటున్నారు శ్రీకాంత్. పైగా అఖండ సినిమాలో తన గెటప్ చూసి తన భార్య ఊహ భయపడింది అంటూ చెప్పాడు శ్రీకాంత్. ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత అదే గెటప్‌లో ఇంటికి వెళ్లానని.. అప్పుడు ఊహతో కలిసి కొందరు మాట్లాడుతూ ఉన్నారని ఆ గెటప్‌లో తనను చూసి వాళ్లంతా కంగారుపడ్డారని గుర్తు చేసుకున్నాడు శ్రీకాంత్. అలాగే సినిమా చూసిన తర్వాత ఊహ కూడా చాలా కంగారు పడిందని.. భయపడుతూనే ఉంది అంటున్నాడు శ్రీకాంత్. తాను అఖండ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్న తర్వాత చాలామందికి నమ్మకం లేదని.. ఎలా చేస్తానో అని తన అభిమానులు కూడా కంగారు పడ్డారు అంటున్నాడు ఈ సీనియర్ హీరో. కానీ సినిమా విడుదలైన తర్వాత బాలయ్య అభిమానులే కాకుండా తనను అభిమానించే వాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అంటున్నాడు శ్రీకాంత్. ఇకపై కూడా కేవలం హీరోగా నటిస్తానని కూర్చోకుండా.. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా కూడా నటిస్తాను అంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Srikanth Says About Akhanda | బాలకృష్ణతో విలన్ అంటే అంత ఈజీ కాదు..!
Medha: శ్రీకాంత్ -ఊహా కూతురు వెండితెరకు పరిచయం కాబోతుందా?
సినిమాలు వదిలేసి.. వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా: శ్రీకాంత్
Akhanda Hindi dubbing rights | అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
అఖండ 3 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న బాలకృష్ణ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhanda
- ooha
- Srikanth
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

