Srikanth Says About Akhanda | బాలకృష్ణతో విలన్ అంటే అంత ఈజీ కాదు..!
90లలో తన నటనతో కోట్ల సంఖ్యలో క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు శ్రీకాంత్ (Srikanth). నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ అఖండ (Akhanda).

నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కెరీర్‌ను మొదలుపెట్టి..ఆ తర్వాత తెలుగులో (Telugu Cinema)హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు శ్రీకాంత్ (Srikanth). 90లలో తన నటనతో కోట్ల సంఖ్యలో క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. కొంతకాలంగా సోలో హీరోగా ట్రాక్‌లో లేని శ్రీకాంత్ (Srikanth). ఇపుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ అఖండ (Akhanda).
బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు.

విలన్ పాత్రలు ఆపాలన్నాడు..
విలన్‌గా చేయడంపై స్పందిస్తూ..నా కెరీర్‌ను విలన్‌గా మొదలుపెట్టా. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హీరో అయ్యా. యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా చేశా. బోయపాటి నన్ను విలన్ పాత్రలు చేయడం ఆపాలని సూచించాడు. నన్ను మెయిన్ విలన్‌గా చూడాలనుకుంటున్నట్టు చెప్పాడు. వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో చాలా ఆఫర్లు తిరస్కరించాను. సడెన్‌గా బోయపాటి ఫోన్ చేసి అఖండ సినిమా గురించి చెప్పారు. బాలకృష్ణతో విలన్‌గా నటించడం అంత ఈజీ కాదు. వరదరాజులు (Varadarajulu Role) పాత్ర కోసం మేకోవర్ మార్చుకున్నానని చెప్పాడు శ్రీకాంత్.

రావణాసురుడిలా నా పాత్ర..
బాలకృష్ణతో శ్రీరామ రాజ్యం తర్వాత చేస్తున్న రెండో సినిమా ఇది. బాలకృష్ణ సోదరుడిగా నటించా. లక్ష్మణుడు పాత్ర చాలా సున్నితమైందని శ్రీకాంత్ అన్నాడు. కానీ అఖండలో నా పాత్ర రావణాసురుడిలా ఉంటుంది. మేమిద్దరం ఓ ఫైట్ సీన్‌ను 8-9 రోజులపాటు దుమ్ములో చేశాం. చాలా కష్టంగా అనిపించినా..బాలకృష్ణ చాలా ప్రోత్సహించారు. నన్ను సినిమాలో చాలా పవర్ ఫుల్‌గా చూడాలనుకున్నారు. అదే విషయాన్ని బోయపాటికి కూడా చెప్పారు. అఖండ ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు నటన అద్బుతంగా ఉందని కాల్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

