అఖండ 3 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న బాలకృష్ణ..

Akhanda collections | బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత కంటిన్యూ అవుతుంది. ఈయన హీరోగా నటించిన అఖండ సినిమా అద్భుతాలు చేస్తుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 60 శాతం రిటర్న్స్ తీసుకొచ్చింది. నాలుగో రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.8 కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ చిత్రం. లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నా.. అభిమానులకు మాత్రం పిచ్చపిచ్చగా నచ్చేసింది అఖండ. అందుకే కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. మూడు రోజుల తర్వాత చూస్తే దాదాపు 36 కోట్ల షేర్ అఖండ ఖాతాలోకి వచ్చేసింది. ఈ సినిమా 3 డేస్ ఏరియా వైజ్ షేర్స్ కూడా వచ్చాయిప్పుడు. ఓవర్సీస్లో అయితే ఇప్పటికే భారీ లాభాల దిశగా అడుగులు వేస్తుంది అఖండ. 2.35 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బాలయ్య.. మూడు రోజుల్లోనే 3.55 కోట్లు వసూలు చేసాడు. మరి ఈ సినిమాకు ఇంకా ఎంత రావాలో చూద్దాం..
నైజాం: 9.16 కోట్లు
సీడెడ్: 7.78 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.87 కోట్లు
ఈస్ట్: 2.04 కోట్లు
వెస్ట్: 1.62 కోట్లు
గుంటూరు: 2.71 కోట్లు
కృష్ణా: 1.66 కోట్లు
నెల్లూరు: 1.41 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 29.25 కోట్లు (44.60 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.60 కోట్లు
ఓవర్సీస్: 3.55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్: 35.40 కోట్లు (56.90 కోట్లు గ్రాస్)
అఖండ సినిమాకు రూ.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఇప్పటి వరకు మూడు రోజుల్లో రూ. 54 కోట్లు వసూలు చేస్తే సేఫ్ అవుతుంది. కచ్చితంగా నాలుగో రోజు కూడా 8 కోట్లకు పైగానే షేర్ వచ్చేలా కనిపిస్తుంది. అంటే వీక్ డేస్ మొదలైన తర్వాత మరో 10 కోట్లు వసూలు చేస్తే బాలయ్య అఖండ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Akhanda | అఖండ సినిమా చూస్తూ బాలయ్య అభిమాని మృతి
అఖండ సహా.. 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు..
ఇవే కలెక్షన్లు కంటిన్యూ అయితే అఖండ బ్లాక్‌బస్టర్ కా బాప్!
Bala Krishna: అంకుల్ అని పిలవడం నాకు అస్సలు నచ్చలేదన్న బాలకృష్ణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

