Akhanda | అఖండ సినిమా చూస్తూ బాలయ్య అభిమాని మృతి

Balayya fan jasthi ramakrishna died | నందమూరి అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ నుంచి బ్లాక్‌బస్టర్ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బాలయ్య అభిమానులతో థియేటర్ల వద్ద సందడి సెలకొంది. దీనికి తగ్గట్టుగానే అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక చేదు వార్త బయటకొచ్చింది. బాలయ్య వీరాభిమాని ఒకరు అఖండ ( Akhanda ) సినిమా చూస్తూ థియేటర్లునే ప్రాణాలు విడిచాడు.
బాలయ్య వీరాభిమాని, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ హఠాన్మరణం చెందాడు. స్థానిక శ్యామల థియేటర్లో ఆయన అఖండ సినిమా చూస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన థియేటర్ యాజమాన్యం ఆయన్ను.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారు. సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో జాస్తి రామకృష్ణ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ దగ్గర నుంచి ఈయన కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు జాస్తి రామకృష్ణ. ఆయన మరణంపై జిల్లాలోని ఇతర ఎగ్జిబిటర్లు సంతాపం తెలిపారు. రామకృష్ణ మరణం జిల్లాకు తీరని లోటు అని అన్నారు. రామకృష్ణ మరణంపై బాలయ్య అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అఖండ సహా.. 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు..
ఇవే కలెక్షన్లు కంటిన్యూ అయితే అఖండ బ్లాక్‌బస్టర్ కా బాప్!
Akhanda | అఖండ ప్రభంజనం..పుష్ప, ఆర్ఆర్ఆర్కు కలిసొస్తుందా..?
Bala Krishna: అంకుల్ అని పిలవడం నాకు అస్సలు నచ్చలేదన్న బాలకృష్ణ
Bala Krishna: చిన్నారితో బాలకృష్ణ ఫన్.. వైరల్‌గా మారిన వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

