ఇవే కలెక్షన్లు కంటిన్యూ అయితే అఖండ బ్లాక్‌బస్టర్ కా బాప్!

Akhanda movie collections | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా తొలి రోజు అఖండమైన ఓపెనింగ్ సాధించింది. ఎవరు ఊహించని విధంగా ఏకంగా రూ.19 కోట్ల షేర్ వసూలు చేసి అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఇప్పుడు సినిమాలు విడుదలైతే థియేటర్స్‌కు జనం మునుపటిలా వస్తారా లేదా అని అనుమానం ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోంది. పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అఖండ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. రొటీన్ కథ అయినా కూడా బోయపాటి శ్రీను తెరకెక్కించిన విధానం ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యింది.
అభిమానులైతే పూనకాలు వచ్చినట్లు థియేటర్లలో ఊగిపోతున్నారు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ నట విశ్వరూపం స్క్రీన్ మీద కనిపించింది. రెండు క్యారెక్టర్స్ కూడా బోయపాటి అద్భుతంగా డిజైన్ చేశాడు. నందమూరి అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా అఖండ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు కూడా ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. మహేశ్ బాబు దగ్గర నుంచి మొదలుపెట్టి నాని వరకు అందరూ బాలకృష్ణ సినిమాను సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ట్వీట్స్ పెట్టారు. చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర పండగ వాతావరణం చూస్తున్నాం అంటూ మురిసిపోతున్నారు. రాబోయే సినిమాలకు ఇది కచ్చితంగా ఒక శుభసూచకం. మొదటి రోజే కాదు.. రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూలు తీసుకొస్తుంది అఖండ. అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో కూడా ఏపీలో చాలాచోట్ల టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. తెలంగాణలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ వారం ఇదే కంటిన్యూ అయితే నాలుగు రోజుల్లో బాలకృష్ణ సినిమా కచ్చితంగా 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Akhanda | అఖండ ప్రభంజనం..పుష్ప, ఆర్ఆర్ఆర్కు కలిసొస్తుందా..?
Bala Krishna: అంకుల్ అని పిలవడం నాకు అస్సలు నచ్చలేదన్న బాలకృష్ణ
Bala Krishna: చిన్నారితో బాలకృష్ణ ఫన్.. వైరల్‌గా మారిన వీడియో
Akhanda movie collections : తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర గర్జించిన అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

