Bheemla nayak effect F3 movie postponed to summer | ఈ సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ కూడా పండుగకే వస్తుంది. వీటితో పాటు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇన్ని పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్లను సర్దుబాటు చేయలేక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాడు. జనవరి 12న విడుదల చేస్తామని చెప్పిన భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25కి వాయిదా వేశాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు చిత్రబృందం ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ భీమ్లా నాయక్ వాయిదా ఎఫెక్ట్ వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ఎఫ్ 3 పై పడింది.
నిజానికి భీమ్లానాయక్ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని.. చాలా రోజుల కిందటే ప్రకటించారు. అప్పటికే మహేశ్‌బాబు కూడా తన సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ సినిమాలు సీన్లోకి రావడంతో కూల్‌గా సైడ్ అయ్యాడు మహేశ్ బాబు. తన సినిమాను సమ్మర్లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ సినిమాను కూడా వాయిదా వేసుకోవాలని ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను కోరారు. అన్ని పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడంలో వచ్చే ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలను పవన్ కళ్యాణ్, చిత్రబృందానికి దిల్ రాజు వివరించి వాయిదాకు ఒప్పించారు. దీంతో తమ భీమ్లా నాయక్ సినిమాను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటికే తమ సినిమాను ఫిబ్రవరిలో తీసుకోద్దామని ప్లాన్ చేసుకుంటున్న ఎఫ్ 3 చిత్ర బృందానికి ఇది షాకింగ్‌గా మారింది.
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.. ఆ సినిమా పేరు ఎఫ్ 3. గత సినిమా సెంటిమెంట్‌తో ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో ఫిబ్రవరిలో ఎఫ్ 3 సినిమాను తీసుకురావాలని ఫిక్సయ్యారు. కానీ సడెన్‌గా భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరికి షిఫ్టయింది. దీంతో ఫిబ్రవరి చివరివారంలో ఎఫ్ 3 సినిమాను విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. అదే ఫిబ్రవరి మొదటి వారంలోనే రిలీజ్ చేద్దామంటే.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4 వ తేదీ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎఫ్3 సినిమాను సమ్మర్‌కు వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నవ్వుల పండుగా ఇప్పుడు సమ్మర్లో.. గెట్ రెడీ ఫర్ సమ్మర్ సోగ్గాళ్ల సందడి అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bheemla Nayak | సంక్రాంతి బరిలో నుంచి భీమ్లానాయక్ ఔట్!
పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. ఊ అంటావా పాటపై సమంత షాకింగ్ పోస్ట్
ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ.. బారికేడ్లు బద్దలు.. ఆశ్చర్యపోయిన ముంబైకర్స్
భీమ్లానాయక్ నిర్మాతపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రశంసలు