Ram Charan in Mumbai | ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ.. బారికేడ్లు బద్దలు.. ఆశ్చర్యపోయిన ముంబైకర్స్
Ram Charan in Mumbai | దాంతో పాటు చరణ్ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి విడుదల అవుతుంటాయి. యూట్యూబ్‌లోనూ మెగా పవర్ స్టార్ సినిమాలకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వందల మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి.
Ram Charan in Mumbai | రామ్ చరణ్‌కు కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హిందీలో అయితే మెగా వారసుడికి ఉన్న ఫాలోయింగ్ చూసి అంతా షాక్ అయిపోయారు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన రామ్ చరణ్‌కు అక్కడ అబిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆయనను చూడటానికి అభిమానులు వీరంగం సృష్టించారు. గేట్లు బద్దలుకొట్టి మరీ లోపలికి రావడానికి ప్రయత్నించారు. వాళ్లను అదుపు చేయడానికి అక్కడున్న సెక్యూరిటీ వల్ల కూడా కాలేదు. రామ్ చరణ్‌ను చూడాలనే ఎగ్జైట్మెంట్లో అక్కడున్న బారికేడ్స్ కూడా తెంచేసుకుని లోపలికి వచ్చారు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ సౌత్ ఇండియన్ హీరోకు ముంబైలో కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందా అంటూ అక్కడున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్‌కు ముందు నుంచి కూడా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు ఉంది. అతడు నటించిన మగధీర సినిమాతో అన్ని భాషల్లోనూ ఫేమస్ అయ్యాడు. మరోవైపు జంజీర్ సినిమాతో 8 ఏళ్ల కిందే బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించాడు రామ్ చరణ్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హిందీలో చరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో పాటు చరణ్ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి విడుదల అవుతుంటాయి. యూట్యూబ్‌లోనూ మెగా పవర్ స్టార్ సినిమాలకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వందల మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి.

Ram Charan in Mumbai | కొత్త సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం
పాన్ ఇండియన్ స్టేటస్ అందుకున్న రామ్ చరణ్.. తన కొత్త సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అభిమానులు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్ర బడ్జెట్ 350 కోట్లకు పైగానే ఉంది. రామ్ చరణ్ తర్వాత సినిమా ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకుడు. అలాగే శంకర్, గౌతమ్ తినన్నూరి దర్శకత్వంలో వరస సినిమాలకు కమిటయ్యాడు రామ్ చరణ్. శంకర్ సినిమాను దిల్ రాజు.. గౌతమ్ తిన్ననూరి సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hema Malini: రోడ్లను తన బుగ్గలతో పోల్చడాన్ని తప్పుపట్టిన హేమమాలిని
Hamsa Nandini: నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్.. కోలుకుని తిరిగొస్తానంటూ ధీమా
పనామా పేపర్ లీక్ కేసు.. ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

