పనామా పేపర్ లీక్ కేసు.. ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు
Aiswarya Rai Bacchan: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ లీక్ కేసులో అమితాబ్‌బచ్చన్ కుటుంబానికి సమస్యలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌ను విచారించిన ఈడీ తాజాగా ఆయన భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు

ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ లీక్ కేసులో అమితాబ్‌బచ్చన్ కుటుంబానికి సమస్యలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌ను విచారించిన ఈడీ తాజాగా ఆయన భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు నోటీసులు జారీచేసింది. ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసులలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ఐశ్వర్యారాయ్ ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్లో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు.
కాగా, ఈ కేసులో ఐశ్వరాయ్ బచ్చన్‌ను ప్రశ్నించేందుకు ఇప్పటికే పశ్నల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పనామా పేపర్ లీక్ కేసులో 500 మంది భారతీయులకు ప్రమేయం ఉన్నది. వారిలో రాజకీయ నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు తదితరుల పేర్లు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వానికి పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు.
పనామా పేపర్ లీక్ కేసులో చాలాకాలంగా దర్యాప్తు జరుగుతున్నది. గత నెల ఐశ్వరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఈ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన నుంచి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్యారాయ్‌ను విచారణకు పిలిచిన ఈడీ త్వరలో అమితాబ్ బచ్చన్‌కు కూడా సమన్లు పంపే అవకాశం ఉన్నది. 2016లో యూకేలో పనామా బేస్డ్ లా సంస్థకు చెందిన 11.5 కోట్ల ట్యాక్స్ డాక్యుమెంట్లు లీకయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

