Hema Malini: రోడ్లను తన బుగ్గలతో పోల్చడాన్ని తప్పుపట్టిన హేమమాలిని
Hema Malini: మహారాష్ట్రలోని తన నియోజకవర్గం ధరంగావ్‌లో రోడ్లు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ ఆదివారం శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని తన నియోజకవర్గం ధరంగావ్‌లో రోడ్లు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ ఆదివారం శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఇవాళ హేమమాలిని ( Hema Malini ) స్పందించారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సాంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు.
అయితే ఇలాంటి కామెంట్లు మంచివి కావని హేమమాలిని వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్లు ఇలాంటి కామెంట్లు చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అన్నారు. మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు.
#WATCH "A trend of such statements was started by Lalu Ji years ago and many people have followed this trend. Such comments are not in a good taste," says BJP MP Hema Malini on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks pic.twitter.com/SJg5ZTrbMw
— ANI (@ANI) December 20, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

