Sukesh Chandrasekhar : జాక్వెలిన్‌తో రూ.500 కోట్లతో సినిమా ప్లాన్ చేసిన సుఖేశ్.. అతడి వలలో అలా చిక్కిందా?
ఇప్పటికే జాక్వెలిన్‌కు సుఖేశ్ ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. తనతో ఓ సూపర్‌హీరో సినిమా కూడా తీస్తానని Sukesh Chandrasekhar మాటిచ్చాడట.
Sukesh Chandrasekhar : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ ప్రస్తుతం తన సినిమాల కంటే కూడా ఎక్కువగా సుఖేశ్ చంద్రశేఖర్ విషయంలో హైలైట్ అవుతోంది. రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ దగ్గర్నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని మోసం చేశాడని అదితి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుఖేశ్‌తో పాటు ఈ మోసంలో ఇన్వాల్వ్ అయిన తన భార్య లీనా మారియాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తీహార్ జైలుకు తరలించారు.

అప్పటి నుంచి సుఖేశ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. బాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా సుఖేశ్ ట్రాప్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా ఉంది.
ఇప్పటికే జాక్వెలిన్‌కు సుఖేశ్ ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. తనతో ఓ సూపర్‌హీరో సినిమా కూడా తీస్తానని సుఖేశ్ మాటిచ్చాడట. రూ.500 కోట్ల బడ్జెట్‌తో జాక్వెలిన్‌ను హీరోయిన్గా తీసుకొని తనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని జాక్వెలిన్‌ను సుఖేశ్ నమ్మించాడట.
Sukesh Chandrasekhar : మూడు పార్టులుగా సూపర్ హీరో సినిమా అంటూ నమ్మించిన సుఖేశ్
అది భారత్‌లోనే తొలి మహిళా సూపర్ హీరో ప్రాజెక్ట్ అని, ఆ సినిమాలో హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేస్తారని.. మూడు పార్టులుగా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను విడుదల చేస్తామని జాక్వెలిన్‌కు సుఖేశ్ చెప్పాడట. అంతే కాదు.. జాక్వెలిన్‌ను హాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీతో పోల్చి.. సూపర్ హీరో సిరీస్‌కు తను అయితేనే కరెక్ట్‌గా సూట్ అవుతుందని జాక్వెలిన్‌ను ఆకాశానికెత్తాడట సుఖేశ్. అలా జాక్వెలిన్.. సుఖేశ్ వలలో పడిపోయిందని స్పష్టంగా అర్థం అవుతోంది.

సుఖేశ్ తీహార్ జైలులో ఉన్నప్పుడు జాక్వెలిన్ తరుచూ అతడిని కలవడానికి జైలుకు కూడా వెళ్లేదని తెలుస్తోంది. అందుకే.. జాక్వెలిన్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసి తనను విచారించగా.. సుఖేశ్ తనకు 1,50,000 డాలర్లు మాత్రమే పంపించాడని స్పష్టం చేసింది. యూఎస్‌లో ఉండే తన సోదరి గెరాల్డైన్కు సుఖేశ్ 1,80,000 డాలర్లు పంపించినట్టు ఈడీ ముందు ఒప్పుకున్నాడు. జాక్వెలిన్ అబద్ధం చెబుతోందని కూడా ఈడీ ముందు సుఖేశ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇలాంటి ఆర్థిక నేరాలు సుఖేశ్ ఎన్నో పాల్పడినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. డొల్ల కంపెనీలను సృష్టించి.. డబ్బును మొత్తం విదేశాలకు తరలించాడనే ఆరోపణను కూడా ప్రస్తుతం సుఖేశ్ ఎదుర్కొంటున్నాడు. తీహార్ జైలులో జైలు సిబ్బందికి నెలకు కోటి రూపాయల లంచం ఇచ్చి అక్కడ అనేక సౌకర్యాలు పొందుతున్నాడని కూడా ఇటీవల సుఖేశ్‌పై ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hema Malini: రోడ్లను తన బుగ్గలతో పోల్చడాన్ని తప్పుపట్టిన హేమమాలిని
Hamsa Nandini: నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్.. కోలుకుని తిరిగొస్తానంటూ ధీమా
పనామా పేపర్ లీక్ కేసు.. ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

