Samantha in oo antava oooo antava Song | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. ఊ అంటావా పాటపై సమంత షాకింగ్ పోస్ట్
Samantha in oo antava oooo antava Song | పుష్ఫ సినిమాలోనే ఈ పాట కుర్రకారుకు తెగ నచ్చేయడం. అవును.. ఈ పాటను యూత్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ పాట సూపర్ హిట్ అవడం ఒక ఎత్తు అయితే

Samantha in oo antava oooo antava Song | ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. ఇప్పుడు ఎవరి నోట్లోనూ ఇదే పాట నానుతోంది. ఊ అంటావా మావా అంటూ పాటలు పాడుకుంటూ జనాలు డ్యాన్సులు చేసుకుంటున్నారు. దానికి కారణం.. పుష్ఫ సినిమాలోనే ఈ పాట కుర్రకారుకు తెగ నచ్చేయడం. అవును.. ఈ పాటను యూత్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ పాట సూపర్ హిట్ అవడం ఒక ఎత్తు అయితే.. ఈ పాటపై అదే స్థాయిలో ట్రోల్స్ కూడా అవుతున్నాయి.

ఈ పాటలో సమంత నటించడం, తన అద్భుతమైన డ్యాన్స్, తన డ్రెస్సింగ్ స్టయిల్.. అన్నీ ఆ పాటను ఎక్కడికో తీసుకుపోయాయి. అయితే.. ఈ పాటపై తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha in oo antava oooo antava Song | ఇంతకీ సమంత తన ఇన్‌స్టాలో ఏం పోస్ట్ చేసిందంటే?
ఇటీవలే సినిమా చూసిన సమంత.. సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయినట్టు పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తను నటించిన ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా పాటపై కూడా స్పందించింది. ఇన్‌స్టాలో ఆ పాట గురించి పోస్ట్ చేసింది.

నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాను. కొన్ని సార్లు బాగా నటించి ఉండొచ్చు.. కొన్ని సార్లు సరిగ్గా నటించి ఉండకపోవచ్చు. కొన్ని సార్లు సరదాగా నటించాను. ఇంకొన్ని సార్లు చాలా సీరియస్‌గానూ నటించాను. కొన్ని సార్లు షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించాను. ఇవన్నీ చేయడానికి నేను చాలా కష్ట పడ్డాను. కానీ.. సెక్సీగా కనిపించాలంటే మాత్రం వామ్మో.. చుక్కలు కనిపిస్తాయి. ఊ అంటావా..ఊఊ అంటావా పాటలో సెక్సీగా కనిపించడం కోసం నేను చేసిన హార్ట్ వర్క్ ఇప్పటి వరకు దేని కోసం చేయలేదు. అది నెక్స్ట్ లేవల్ హార్ట్ వర్క్. దానికి ఫలితం దక్కింది. ఆ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది.. అంటూ సమంత ఇన్‌స్టా పోస్ట్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | సంక్రాంతి బరిలో నుంచి భీమ్లానాయక్ ఔట్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

