Chiranjeevi Pan india | ‘ఆచార్య’ విషయంలో అసంతృప్తిగా చిరంజీవి..?
చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న చిత్రం ఆచార్య (Acharya). పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప ఇప్పటికే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.

టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య (Acharya). ప్రపంచవ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
అయితే పాన్ ఇండియా రిలీజ్ విషయంలో చిరు సంతోషంగా లేడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆచార్య కథ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉండటం..ఇతర ప్రాంతాల్లో ఈ స్టోరీకి అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని భావిస్తున్నాడట చిరు. అయితే మరోవైపు రాంచరణ్ మాత్రం పాన్ ఇండియా రిలీజ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తన్నాడట. మరి ఆచార్య తెలుగుకే పరిమితమవుతాడా..? లేదంటే పాన్ ఇండియా ప్రేక్షకులను పలుకరిస్తాడా..? అనేది చూడాలి.
సామాజిక ఇతివృత్తంతో యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆచార్యలో రాంచరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా… కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌గా వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాలతోపాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

