అందరూ మర్చిపోయిన వరుణ్ సందేశ్‌ను ఆ సినిమా గుర్తు చేస్తుందా..?

Varun Sandesh in Induvadana | బిగ్‌బాస్ తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు వరుణ్ సందేశ్. బిగ్‌బాస్ సీజన్ 3లో ఈయన.. తన భార్య వితికతో కలిసి వచ్చాడు. ఆ షోతో క్రేజ్ వచ్చినప్పటికీ.. పెద్దగా సినిమాలేమీ చేయలేదు వరుణ్ సందేశ్. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈయన నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఇందువదన సినిమాతో వరుణ్ సందేశ్ చాలా ఏండ్లకు టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఫర్నాజ్‌శెట్టి కథానాయిక. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇందువదన సినిమా పోస్టర్స్ చాలా కళాత్మకంగా ఉన్నాయి. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్‌ను బాగా డిజైన్ చేశారు దర్శకుడు ఎమ్మెస్సార్. ఈ సినిమాకు ఇండస్ట్రీలో ప్రముఖులు ప్రమోషన్ చేస్తున్నారు.

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ మళ్లీ హిట్ కొట్టలేదు. ఇలాంటి సమయంలో ఇందువదన సినిమా వస్తుంది. ఇందువదన తన సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా కోసం వరుణ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీశ్ ఆకేటి అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. జనవరి 1, 2022 నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఇందువదన మర్చిపోయిన వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులకు గుర్తు చేస్తుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శానా కష్టం అంటున్న చిరంజీవి.. ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్..
Rajamouli | అజిత్ చేసిన పనికి ఫిదా అయిపోయిన రాజమౌళి..
Arjuna Phalguna | అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ
Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!
Vishwak sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

