Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!

Samantha New year celebrations | గత కొన్నేండ్లుగా కొత్త సంవత్సరం వచ్చిందంటే భర్తతో పాటు గోవా లేదంటే విదేశాలకు వెళ్లిపోయేది సమంత. కానీ అదంతా గతేడాది వరకూ.. ఈ ఏడాది భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి జీవితం గడుపుతుంది సమంత. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ప్రతి సంవత్సరం న్యూఇయర్ వచ్చిందంటే చాలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేది సమంత. నాగచైతన్యతో ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేది. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఒంటరి జీవితం గడుపుతుంది మాజీ అక్కినేని కోడలు. ఈ క్రమంలో ఆమె కొత్త సంవత్సర వేడుకలు ఎవరితో సెలబ్రేట్ చేసుకోబోతోందనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

చైతూతో విడిపోయిన తర్వాత తల్లిదండ్రులకు ఎక్కువగా దగ్గరైంది సమంత. గత కొన్నేండ్లుగా వాళ్లతో దూరంగానే ఉంటున్న ఈమె.. విడాకుల తర్వాత మళ్లీ వాళ్లతో కలిసి పోయింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరెంట్స్ నాగచైతన్యపై కొన్ని విమర్శలు కూడా చేశారు. మరోవైపు స్నేహితులకు కూడా ఎక్కువగా సమయం కేటాయిస్తుంది సమంత. డివోర్స్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి దేశమంతా తిరుగుతుంది ఈమె. మొన్నటికి మొన్న గోవా వెళ్లి బికినీ ఫోటోలు కూడా షేర్ చేసింది. ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసుకోవడం సమంతకు అలవాటు. ఈసారి కూడా అదే చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ. కాకపోతే ఈసారి చైతన్య ప్లేస్‌లో ఫ్రెండ్స్ ఉండబోతున్నారని తెలుస్తోంది. స్నేహితులతో కలిసి కొత్త ఏడాది సంబరాలు చేసుకున్న తర్వాత ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌తో బిజీ కానుంది సమంత. మరోవైపు నాగ చైతన్య కూడా తన కొత్త సంవత్సర వేడుకలు కుటుంబంతో జరుపుకోబోతున్నట్లు తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha Fitness Secret | వార్నీ సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదా.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందా? ఇది దుర్మార్గం అంటూ బ్రహ్మానందం రియాక్షన్
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. ఊ అంటావా పాటపై సమంత షాకింగ్ పోస్ట్
Samantha | బికినీలో సెగలు పుట్టిస్తున్న సమంత..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

