అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..

Samantha in NTR Movie | సాధారణంగా పెళ్లి తర్వాత సినిమా హీరోయిన్లకు అవకాశాలు రావు అంటారు.. కానీ సమంత మాత్రం ఈ విషయంలో చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత కూడా మరింత బిజీ అయిపోయింది. ముఖ్యంగా మునపటిలా సమంతకు అవకాశాలు వస్తాయా రావా అని అందరూ అనుకుంటున్న సమయంలో.. స్టార్ హీరోల నుంచి ఈమెకు పిలుపు రావడం నిజంగానే ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా సబ్జెక్టుల వైపు అడుగులు వేస్తుంది సమంత. ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తీసుకొచ్చిన ఇమేజ్ తన కెరీర్ కోసం సరిగా వాడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే యశోదతో పాటు మరో రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగానే తెలుగులో స్టార్ హీరోలు మరోసారి సమంత వైపు కన్నేస్తున్నారు. ఈ మధ్యే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేసింది సమంత. ఈ పాటకు ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేవలం ఐదు రోజుల షూటింగ్ కోసం కోటి 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తర్వాత ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా సమంత వైపు చూస్తున్నాడు. ఇప్పటికే ఆమెతో నాలుగు సినిమాల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఐదో సారి జోడి కట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సమంతను మెయిన్ హీరోయిన్గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా, జనతాగ్యారేజ్ సినిమాల్లో కలిసి నటించారు జూనియర్ ఎన్టీఆర్, సమంత. ఈ ఇద్దరి జోడీకి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఐదో సారి రిపీట్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నాడు. పైగా ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషలలో కూడా వస్తోంది. సమంతకు ఇప్పుడు అన్ని భాషల్లో మంచి ఇమేజ్ ఉండటంతో ఈమె బెటర్ ఛాయిస్ కానీ ఎన్టీఆర్ కూడా భావిస్తున్నాడు. ఇదేగాని నిజమైంది అంటే సమంత రెండో ఇన్నింగ్స్ కు ఇంతకంటే మంచి సినిమా పడనట్లే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందా? ఇది దుర్మార్గం అంటూ బ్రహ్మానందం రియాక్షన్
Samantha: సమంత స్పెషల్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..!
RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- NTR
- ntr 30
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

