RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Junior NTR | టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కావడం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. అందుకే పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. వీటితో బాలీవుడ్లో కూడా పాగా వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రభాస్ తన రేంజ్‌ను పెంచేసుకున్నాడు. స్ట్రెయిట్‌గా బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో వెళ్లేందుకు ఎన్టీఆర్ కూడా సిద్దంగా ఉన్నాడు. ఇదే విషయాన్ని స్వయంగా తారక్‌నే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. జనవరి 7న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ఈ క్రమంలోనే ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో స్ట్రెయిట్ ఫిలిం ఎప్పుడు చేస్తారని ఓ విలేకరి తారక్‌ను అడిగాడు. దీనికి ఎన్టీఆర్ కూడా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.
నేను కూడా బాలీవుడ్ సినిమా ఆఫర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ట్రిపుల్ ఆర్ విడుదల తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశిస్తున్నా అని బదులిచ్చాడు ఎన్టీఆర్. అలా బాలీవుడ్ సినిమాల్లో నటించడంలో తనకున్న ఆసక్తిని బాహాటంగానే బయటపెట్టశాడు. నిజానికి హిందీ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వర్షన్లో భరతుడిగా జూనియర్ నటించాడు. అయితే ఆ సినిమా మాత్రం విడుదల కాలేదు. కానీ ఇన్నేండ్లకు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు జూనియర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR | మలయాళంలో డబ్బింగ్ చెప్పకపోడానికి కారణం అదేనంటున్న తారక్..
ఆలియా భట్‌తో నటించడానికి తారక్ కంగారుపడ్డాడా?
మహేష్ సినిమాపై రాజమౌళికి ప్రశ్న.. స్పందన ఏంటో తెలుసా?
NTR: ఇక ఇదే చివరి సారి అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

