మలయాళంలో డబ్బింగ్ చెప్పకపోడానికి కారణం అదేనంటున్న తారక్..

NTR on RRR movie malayalam dubbing | నాలుగేళ్ల కింద బాహుబలి సినిమాతో బాలీవుడ్ వైపు వెళ్లినప్పుడు అది ఒక డబ్బింగ్ సినిమా మాదిరి విడుదలైంది. ఎన్ని వందల కోట్లు వసూలు చేసిన కూడా అందులో హీరో హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోలేదు. దాంతో ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు అలాగే ఉండిపోయింది. కానీ ఈసారి మాత్రం అలా ఉండకూడదు అని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు రాజమౌళి. అందుకే తమ హీరోలతో సొంత డబ్బింగ్ చెప్పించాడు. తాజాగా విడుదలకు సిద్ధమైన ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పారు. అది కూడా చాలా స్పష్టంగా ఎలాంటి తప్పులు లేకుండా చెప్పారు ఈ ఇద్దరు హీరోలు. ఇదే విషయంపై ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు.

హైదరాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల తమకు హిందీపై కాస్త పట్టు ఉందని.. దాంతో ఎలాగోలా నేర్చుకొని హిందీలో కూడా తామిద్దరం డబ్బింగ్ చెప్పాము అని క్లారిటీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. మరోవైపు తమిళం కూడా ఇద్దరు బాగానే మాట్లాడతారు. అంటే అక్కడ కూడా ఎలాంటి సమస్య లేదు. ఇక ఎన్టీఆర్ కన్నడ భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తల్లి శాలిని కర్ణాటక నుంచి వచ్చారు. దాంతో కన్నడ అద్భుతంగా మాట్లాడుతాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఆయన సొంత డబ్బింగ్ చెప్పాడు. రామ్ చరణ్ కూడా ఎలాగోలా కష్టపడి కన్నడలో డబ్బింగ్ చెప్పాడు. అన్ని భాషల్లోనూ ఇద్దరు హీరోలు అద్భుతంగా కవర్ చేశారు. ట్రైలర్ చూస్తుంటేనే ఇద్దరి ఓన్ డబ్బింగ్ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని అర్థమవుతుంది. కానీ మలయాళంలో మాత్రం అటు జూనియర్ ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్ ఇద్దరు డబ్బింగ్ చెప్పలేదు. నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పిన ఇద్దరు ఎందుకు మలయాళం వదిలేశారు అనే ప్రశ్న చాలా మందిలో మిగిలిపోయింది. ఇప్పుడు ఇదే ప్రశ్న ఎన్టీఆర్ ను అభిమానులు అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం విన్న తర్వాత అందరూ బిజీ అయిపోయారు.
ఏదైనా ఒక భాషలో డబ్బింగ్ చెప్పాలి అంటే కచ్చితంగా దాని మీద కాస్తోకూస్తో మనకు పట్టు ఉండాలి. మనం ఏం చెప్తున్నాం.. ఎలాంటి పదాన్ని ఎలా ఉచ్చరిస్తున్నాము అనే విషయం మనకు కచ్చితంగా తెలిసి ఉండాలి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తనకు, రామ్ చరణ్ కు అలాంటి ఇబ్బంది రాలేదని.. కానీ మలయాళంలో ఆ ఇబ్బంది వచ్చింది అంటున్నాడు. భాష తెలియనప్పుడు డబ్బింగ్ చెప్పలేము అంటున్నాడు ఈయన. అనవసరంగా ఆ భాషను ఈ విధంగా కించపరచకూడదనే ఉద్దేశంతోనే మలయాళంలో డబ్బింగ్ చెప్పలేదు అంటున్నాడు ఎన్టీఆర్. ఆ భాషలో ఎన్టీఆర్, చరణ్ కు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ట్రిపుల్ ఆర్. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
NTR: ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..!
ఆలియా భట్‌తో నటించడానికి తారక్ కంగారుపడ్డాడా?
NTR: ఇక ఇదే చివరి సారి అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం..!
Rajamouli: ఆర్ఆర్ఆర్ చిత్రానికి బీజం ఎలా పడిందో చెప్పిన రాజమౌళి
Alia Bhatt: తెలుగులో మాట్లాడిన అలియా.. పగిలిపోయిందంటూ కామెంట్
RRR ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్ రాకపోవడానికి కారణమేంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

