Alia Bhatt: తెలుగులో మాట్లాడిన అలియా.. పగిలిపోయిందంటూ కామెంట్

జనవరి 7న విడుదల కానున్న విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ సినిమా కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ముంబై, చెన్నై, బెంగళూరు సిటీలలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ బృందం తాజాగా హైదరాబాద్‌లోను మీడియాతో ఇంటరాక్ట్ అయింది. అలియా భట్ కొద్ది సేపు ఈ కార్యక్రమంలో పాల్గొని ముంబైకి వెళ్లింది.
అలియా భట్ మొదటిసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్న అలియా భట్ కు ఇప్పటికే భారీ స్థాయిలో క్రేజ్ అయితే దక్కింది. ఆమె అల్లూరి సీతారామరాజు పాత్రకు సతీమణి సీత పాత్రలో నటిస్తోంది. తప్పకుండా ఆ పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతో ఆకట్టుకోనుందని తెలుస్తుంది.
ఇక మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ముందు అందరికీ నమస్కారం అంటూ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించింది అలియా. మీడియా కూడా మీరు బాగున్నారా అని అడగడంతో అందుకు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం విజిల్స్ తో మారుమ్రోగింది. ట్రైలర్ పగిలిపోయింది కదా అంటూ ముంబైలో అయితే మాకు పిచ్చెక్కిపోయింది అంటూ తనదైన స్టైల్లో మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం అలియా తెలుగు నేర్చుకునేందుకు ఓ ట్యూటర్ని పెట్టుకొని ఏడాదికి పైగా కష్టపడింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

